వీరవరం గ్రామంలో రూ.2.10 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 27:మండలంలో జీకే వీధి పంచాయతీ పరిధిలోని వీరవరం గ్రామంలో సుమారు రూ.2 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జీకే వీధి సర్పంచ్ కోర్ర సుభద్ర, ఎంపీపీ బోయిన కుమారి, ఎంపీటీసీలు రీమల రాజేశ్వరి, పసుపులేటి నాగమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొండలరావు, బీజేపీ మండల అధ్యక్షుడు కాకూరి శేఖర్,అరకు...