వేలూరు గ్రామంలో పోలీసుల భారీ తనిఖీలు
21 వాహనాలు, 14 ఆయుధాలు స్వాధీనం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 28: చిలకలూరిపేట : పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో సబ్‌డివిజన్ పరిధిలోని సి.ఐలు, ఎస్.ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి వీధిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు,...