వైభవంగా సీతారాముల కళ్యాణం
చింతూరు, పెన్ పవర్ మార్చి 27: స్థానిక శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ప్రాంగణాన్ని సాంప్రదాయబద్ధంగా చలువ తాటాకు పందిర్లతో అలంకరించి, భక్తుల కోసం బెల్లం పానకం ఏర్పాటు చేశారు. భజన బృందాలు సీతారాముల కల్యాణ గీతాలను ఆలపించాయి. సుందరంగా అలంకరించిన శ్రీరామ, సీతమ్మ, లక్ష్మణుల విగ్రహాల సమక్షంలో కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక గిరిజనుల సహకారంతో ఆలయ పరిసరాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. మండలంలోని పలు గ్రామాల నుండి భక్తులు పెద్ద...