శిక్షణ ఇచ్చారు… లబ్ది మరిచారు 140 మంది ఎదురుచూపు
సీతానగరం, పెన్ పవర్, మార్చి 26: మహిళలు స్వయం ఉపాధి పొందేలా మూడు నెలల పాటు కుట్టు శిక్షణ ఇచ్చినా.. ఆ తరువాత కల్పించాల్సిన లబ్ధి అందకపోవడంతో వందలాదిమంది నెలలుగా నిరీక్షిస్తున్నారు. బీసీ కార్పొరేషన్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలు స్వయం ఉపాధి పొందితే ఆర్థికంగా వృద్ధి చెందాలని కూటమి ప్రభుత్వం ఆశయం నీరుగారుతోంది. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక బ్యాచ్ ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు...