సర్పంచ్‌లకు చెక్ పవర్ నిలుపుదల

– ప్రత్యేక అధికారుల నియామకానికి సిద్ధం కాజులూరు, పెన్ పవర్, మార్చి 26: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చెల్లింపుల అధికారాలపై ఆంక్షలు విధించింది.బుధవారం నుంచి సర్పంచ్‌లు నేరుగా చెల్లింపులు చేసే అవకాశం నిలిపివేయబడింది. ఇకపై జీతాలు వంటి అత్యవసర ఖర్చులు చేయాల్సి వచ్చినప్పుడు డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డిడిఓ) అనుమతి తప్పనిసరి.ఇప్పటివరకు సిఎఫ్‌ఎమ్‌ఎస్ ద్వారా సర్పంచ్‌లు బిల్లులకు థంబ్...