అంబేడ్కర్ జీవిత చరిత్ర నేటి తరాలకు ఆదర్శం..!
పోట్ల గోవింద్ పుల్లల చెరువు, పెన్ పవర్, ఏప్రిల్ 14 పుల్లల చెరువు మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచే కార్యక్రమాలు ప్రారంభమై పట్టణమంతా ఉత్సాహభరిత వాతావరణంలో మునిగిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని అంబేడ్కర్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటాలు, జెండాలు చేతబట్టి యువకులు,...