“అంబేద్కర్ అందరివాడు” మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ
విజయవంతం చేయాలని మంత్రి సుభాష్ పిలుపు రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 21: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 26న పిఠాపురం రోడ్డులోని పవర గ్రామంలో నిర్వహించనున్న “అంబేద్కర్ అందరివాడు” జాతీయ మహాసభకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన నాయకుడు కాదని, ఆయన అందరివాడని పేర్కొన్నారు. సమానత్వం,సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం...