చింతూరు పెన్ పవర్ 1: అఖిల భారత రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఐ టీ డి ఎ ముందు ధర్నా నిర్వ హించారు. అనంతరం పిఒకు మెమొరాండం సమర్పించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని, అలాగే పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఆ నిర్వాసితులకు నిర్మించిన కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ...