అడ్డతీగలలో సౌర విద్యుత్ యోజనకు శ్రీకారం. మండలంలో సోలార్ వెలుగులు…

అడ్డతీగల, పెన్ పవర్,ఏప్రిల్ 09: అడ్డతీగల మండలంలో పీఎం సూర్యఘర్ యోజన కింద తొలి సోలార్ రూఫ్‌టాప్ యూనిట్‌ను ఎమ్మెల్యే మిరియాల. శిరీష దేవి ప్రారంభించారు. సినిమా హాల్ కాలనీలో వేమగిరి .అర్జున్ నివాసంపై ఏర్పాటు చేసిన యూనిట్‌ను ఎమ్మెల్యే శిరీష దేవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో మొదటి విడతలో 538 సర్వీసులు ఏర్పాటు చేసి సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సాధించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు నెలకు రూ.200 చొప్పున సబ్సిడీ...