అణగారిన వర్గాల ఆశ జ్యోతి బాబు జగ్జీవన్‌రామ్…
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 5 పుల్లల చెరువు మండల కేంద్రంలో సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహానేత బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. భారత రాజకీయాల్లోనే కాకుండా, వెనుకబడిన వర్గాల హక్కుల సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి...