అధికారుల అలసత్వం సహించను – ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
గంగవరం /గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 10: ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం చూపకూడదని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్పష్టం చేశారు. గుర్తేడు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆమె మండల పార్టీ అధ్యక్షుడు పొత్తూరి కాంతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఆమెకు గ్రామస్తులు, కూటమి శ్రేణులు ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఆమె ప్రజల నుండి అందిన ప్రతి దరఖాస్తును పరిష్కరించేందుకు...