అన్యం శ్రీరాం పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి

  – సస్పెన్షన్ డిమాండ్‌తో దళిత నేతల హెచ్చరిక కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 16: ఎస్సీ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తిని వెంటనే అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దళిత నాయకులు ఘాటుగా డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.వివరాల ప్రకారం, వ్యాపార లావాదేవీల సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ కాజులూరుకు చెందిన...