అమరావతికి చట్టబద్ధతపై ఎమ్మెల్యే శిరీషాదేవి హర్షం

  గంగవరం , పెన్ పవర్ ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026’ను లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి మరియు లోక్‌సభ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి నిర్మాణానికి మార్గం సుగమమైందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమరావతి భావితరాల అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తుందని...