అమరావతికి చట్టబద్ధత.. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వాలకు స్పష్టత : ప్రత్తిపాటి

రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించడంపై తెలుగుజాతిలో హర్షాతిరేకాలు. హైకోర్టు న్యాయవాదుల విజయోవత్సవ ర్యాలీలో మాజీమంత్రి ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 07:  చిలకలూరిపేట : అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేయడం పట్ల యావత్ తెలుగుజాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోందని, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి కల్పించిన చట్టబద్ధత.. రాష్ట్ర అభివృద్ధికి స్థిరమైన స్పష్టతకు నాంది పలికిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు లభించడాన్ని స్వాగతిస్తూ, హైకోర్టు న్యాయవాదుల జేఏసీ...