అర్ధరాత్రి వేళ అంబులెన్స్‌లో ప్రసవం

108 సిబ్బంది సమయస్ఫూర్తితో తల్లి, బిడ్డ క్షేమం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03:  ఎడ్లపాడు : పల్నాడు జిల్లాలో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఒక గర్భిణీకి అంబులెన్స్‌లోనే సుఖప్రసవం జరిగింది. ఎడ్లపాడు మండలం కారచోల గ్రామానికి చెందిన పి. యేసుమ్మ (22) అనే మహిళకు శుక్రవారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎడ్లపాడు అంబులెన్స్ సిబ్బంది ఆమెను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమయ్యాయి.పరిస్థితిని గమనించిన ఈఎంటి దేవదానం,...