అల్లూరి జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

స్టాఫ్ రిపోర్టర్, పాడేరు పెన్ పవర్ ఏప్రిల్ 11:అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిషాంతి ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యకు పునాది వేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. విద్యా ప్రాముఖ్యతను గుర్తించి కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం...