అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తిరుమాని శ్రీపూజ

స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,ఏప్రిల్ 11:అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా తిరుమాని శ్రీపూజ శనివారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్ అధికారుల ప్రమోషన్లు, బదిలీల్లో భాగంగా ఆమెను ఈ పదవికి నియమించింది. ఇంతకు ముందు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన ఆమెకు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.బాధ్యతల స్వీకరణకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జ్ రెవెన్యూ అధికారి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. నీలకంఠరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్‌రావు, సూపరింటెండెంట్ లక్ష్మణరావు తదితరులు అవసరమైన...