ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో అక్రమ పశువుల రవాణా
చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు అక్రమంగా పశువులను తరలించే కార్యకలాపాలు కొత్త మలుపు తిరిగాయి. ఇప్పటివరకు సాధారణ మార్గాల్లో కొనసాగిన ఈ రవాణా, తాజాగా ఇసుక లారీలను అడ్డుగా పెట్టుకుని జరుగుతోందని సమాచారం. దాటించే వ్యక్తులు అధికారుల కంటపడకుండా ఉండేందుకు రూట్లను కూడా మారుస్తున్నారు. ముఖ్యంగా చింతూరు నుంచి భద్రాచలం మీదుగా వెళ్లే మార్గాన్ని ఉపయోగిస్తూ, ఇసుక లారీలలో పశువులను దాచిపెట్టి తరలిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ విధానం పుష్ప సినిమాను తలపించేలా ఉందని పలువురు...