ఆరు పంచాయతీలకు ఎంపీడీవో జె.రాంబాబు బాధ్యతలు

కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 3: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం, ఆర్యవటం,పెనుమళ్ళ, మంజేరు, కుయ్యేరు, కాజులూరు గ్రామపంచాయతీలకు శుక్రవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జె. రాంబాబు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఉదయం గొల్లపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పంచాయతీ కార్యదర్శి సిహెచ్ సూర్య ప్రకాశరావు, గ్రేడ్-5 కార్యదర్శి భాగ్యవతి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అలాగే పంచాయతీ సిబ్బంది సమీర్ శర్మ, వీఆర్వోలు ఎస్. శ్రావణి, శ్రీనివాస్, తాతారావు లు...