ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్..?
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 16 మండలంలో ఉపాధి హామీ పథకం అమలుపై భారీ దుమారం రేగింది. రెండు గ్రామ పంచాయతీలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను అకస్మాత్తుగా సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. అధికారుల ఈ హఠాత్ నిర్ణయం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి, పథకం నిర్వహణలో ఉన్న లోపాలపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పనుల అమలులో అవకతవకలు, మస్టర్ రోల్స్‌లో గందరగోళం, హాజరు పట్టికల్లో తేడాలు వంటి ఆరోపణలు తీవ్రరూపం దాల్చడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కొంతకాలంగా...