ఈఎంఆర్‌ఎస్ పాఠశాలలపై కలెక్టర్ సమీక్ష
విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి… వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 29: జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల (EMRS) విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమంపై జిల్లా కలెక్టర్ నిషాంతి టి. సమగ్ర సమీక్ష నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో EMRS ప్రిన్సిపల్స్, ఐటిడిఏ, గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.గత మూడు సంవత్సరాల 10వ, 12వ తరగతి ఫలితాలను...