ఉపాధి హామీలో ఫేషియల్ హాజరు రద్దుకు డిమాండ్: కలెక్టర్‌కు వినతి  

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 29: ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ (ముఖ గుర్తింపు హాజరు) విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్ టి. నిశాంతికి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానం కారణంగా ఉపాధి హామీ కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ముఖ గుర్తింపు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అనేక మంది కూలీల హాజరు నమోదు...