ఎగ్ కార్ట్ పథకం ద్వారా స్వయం ఉపాధి

రామచంద్రపురం, పెన్ పవర్ ఏప్రిల్10: పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్‌ఈసీసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎగ్ కార్ట్ పథకం ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందవచ్చని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని తోటపేటలో లబ్ధిదారు దవులూరి సత్య మాధవి ఏర్పాటు చేసిన ఎగ్ కార్ట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పథకం...