ఎస్సీల భూముల ఆక్రమణపై విచారణ…

బాధితులకు న్యాయం చేస్తాం.ఎస్సీ కమిషన్ సభ్యుడు గౌతం రాజు పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 2 మండలంలోని కున్నంపల్లి గ్రామంలో ఎస్సీలకు కేటాయించిన భూముల ఆక్రమణపై ఎస్సీ కమిషన్ దృష్టి సారించింది.బాధితుల ఫిర్యాదుతో స్పందించిన కమిషన్ అధికారులు గురువారం పుల్లలచెరువు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.కున్నంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 583లో ఎస్సీలకు చెందిన బుధాటి అంజమ్మ, ముండ్ల మరియబాబు భూములను అగ్రవర్ణాలకు చెందిన సుబ్బారెడ్డి, కృష్ణరెడ్డి, రామిరెడ్డి ఆక్రమించుకుని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు...