ఏపీఓ రాంప్రసాద్ సేవలు అభినందనీయం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 23:జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీఓ చల్లంగి రాంప్రసాద్ సేవలు అభినందనీయమని ఎంపీపీ బోయినకుమారి, ఎంపీడీవో రమణబాబు పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన సేవలను గుర్తిస్తూ శుక్రవారం ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీకే వీధి మండలం భౌగోళికంగా విస్తీర్ణం ఎక్కువగా ఉండి, మారుమూల గ్రామాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం, రహదారుల నిర్మాణం వంటి...