ఏప్రిల్ పదో తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్  ఏప్రిల్ 8:పాడేరు డివిజన్‌లోని జి. మాడుగుల, జి.కే. వీధి మండలాల్లో ఈ నెల 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 33 కేవీ లైన్ల మరమ్మత్తుల కారణంగా అన్ని గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుంది. వినియోగదారులు సహకరించాలని పాడేరు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.వేణుగోపాల్ కోరారు.