ఏప్రిల్ 15న పంచాయతీ కేంద్రాల్లో ఓటర్ జాబితా ప్రదర్శన

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 14: మండలంలో ఏప్రిల్ 15 వ తేది న అన్ని గ్రామ పంచాయతీల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాలు ప్రచురించనున్నట్లు ఎంపీడీఓ రమణబాబు, ఉప మండల అభివృద్ధి అధికారి రత్నకుమార్ తెలిపారు. గ్రామస్తులు తమ పేర్లు ఓటర్ జాబితాల్లో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి సవరించుకోవాలని పేర్కొన్నారు.