ఒంటరి మహిళకు ఆర్థిక భరోసా– తక్షణమే ఉపాధి కల్పించిన కలెక్టర్
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి, పెన్ పవర్,ఏప్రిల్ 18: ఒంటరి మహిళల సంక్షేమంపై జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేస్తోందని మరోసారి రుజువైంది. కష్టాల్లో ఉన్న మహిళ విన్నపాన్ని సానుభూతితో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిషాంతి టి., ఆమెకు తక్షణ ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భరోసా కల్పించారు.ముంచంగిపుట్టు మండలం జర్జుల గ్రామపంచాయతీకి చెందిన వి. బిమలమ్మ శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి తన గోడును వినిపించారు. తన భర్త మరణంతో కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని, జీవనోపాధి...