ఒక్క ఫిర్యాదుతో 342 గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 24:రెండు నెలలుగా వంటగ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఉపశమనం లభించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేసిన ఫిర్యాదుతో అధికారులు స్పందించి 342 గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని వినియోగదారులకు గూడెం కాలనీలోని ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా హెచ్‌పీ గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఇటీవల గ్యాస్ కొరత కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడి సుమారు రెండు నెలలుగా సిలిండర్లు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలో జీకేవీధి ఎంపీటీసీ...