ఓటర్ లిస్ట్ పరిశీలన

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 24:   బొడ్రాయిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఓటర్ లిస్ట్ పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతూరు మండల జనసేన ఉపాధ్యక్షులు తీగల రవి దుర్గారావు ముఖ్యంగా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల పేర్లు, వివరాలు సరిగా ఉన్నాయా లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. ఎవరైనా వివరాల్లో తప్పులు గమనిస్తే వెంటనే సంబంధిత పంచాయతీ బూత్ లెవల్ ఆఫీసర్ (బ్లాక్ )ను సంప్రదించి మార్పులు చేర్పులు చేయించుకోవాలని తెలిపారు....