క్షయ నిర్మూలనకు ప్రజలందరి సహకారం అవసరం

  డీఎంహెచ్ఓ డా. సరిత గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 8: క్షయ వ్యాధి (టిబి) నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన “టీబీ ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా పెదగెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగరం, వాల్మీకి పేట, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. సరిత మాట్లాడుతూ దేశం నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం 100...