గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజెన్సీ డీఈవో తనిఖీ

  గంగవరం, పెన్ పవర్: గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహణలో ఉన్న రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు నమోదు, బోధన సంబంధిత రికార్డులు, పాఠ్య ప్రణాళికలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.అలాగే ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ అసెస్‌మెంట్–2 (SA2) పరీక్షలను పరిశీలిస్తూ, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండాలని...