గంజాయి, బాల్య వివాహాలపై పోలీసుల అవగాహన
మంగంపాడు శాండీ, నవగూడ గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహణ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 25: చింతూరు మండల పరిధిలోని మంగంపాడు శాండీ, నవగూడ గ్రామాలలో స్థానిక ఎస్‌ఐ డోంకరాయి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గంజాయి వినియోగం వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాల నివారణ, మహిళలపై జరిగే నేరాల నియంత్రణ, సైబర్ క్రైమ్‌లపై జాగ్రత్తలు, రోడ్డు భద్రత వంటి ముఖ్య అంశాలపై ప్రజలకు వివరంగా తెలియజేశారు. ప్రత్యేకంగా, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు...