గిరిజన రైతులకు రబ్బర్ సాగు ప్రోత్సాహం మరో 3 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ లక్ష్యం
మారేడుమిల్లి/ గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 10 : గిరిజన ప్రాంతాల్లో రబ్బర్ సాగును విస్తరించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్ణాలి దేఖ తెలిపారు.శుక్రవారం మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రబ్బర్ ప్లాంటేషన్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్‌తో కలిసి ప్లాంటేషన్ పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా డాక్టర్ వర్ణాలి...