గృహ లెక్కల సర్వే మే నెలలో నిర్వహణ
చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30: చింతూరు డివిజన్‌లో గృహ లెక్కల కార్యక్రమం మే 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రాజెక్ట్ అధికారి, ఐటిడిఏ చింతూరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మే 31 వరకు కొనసాగనుందని అధికారికంగా తెలియజేశారు. ఈ గృహ గణనలో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలు, గృహ సమాచారం తదితర అంశాలను సేకరించి సెన్సస్ యాప్ ద్వారా డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. ఈ సమాచారం ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రూపకల్పనలో కీలకంగా...