గొల్లపాలెంలో ఘనంగా ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు

 భక్తులతో కిటకిటలాడిన జాతర కాజులూరు, ఏప్రిల్‌ 9: మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో గురువారం గ్రామదేవత ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు పలు ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గొల్లపాలెం–కొంగోడు గ్రామాల సరిహద్దులో, కాకినాడ–కోటిపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ధనమ్మ తల్లి ఆలయం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. కరప, కాజులూరు మండలాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నైవేద్యాలు...