గొల్లపాలెంలో పెట్రోల్ బంకుల తనిఖీ

వరికోత యంత్రాలకు డీజిల్ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలి -తహశీల్దార్‌ జి.ఆర్‌.ఠాగూర్‌ ఆదేశాలు కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26: కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలోని పెట్రోల్ బంకులను తహశాల్దార్‌ జి.ఆర్‌.ఠాగూర్‌ సందర్శించి ప్రస్తుత డీజిల్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల వరికోతల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో హార్వెస్టర్ యంత్రాలకు డీజిల్ కొరత ఏర్పడుతున్నట్లు రైతులు వ్యక్తం చేసిన ఆందోళనపై అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా బంక్ యజమానులతో తహశీల్దార్‌ ఠాగూర్‌ మాట్లాడారు. వరికోత యంత్రాలకు,అంబులెన్స్‌ సర్వీస్‌లకు డీజిల్‌ను అత్యవసర ప్రాధాన్యత కింద సరఫరా చేయాలని...