గొల్లపాలెం ట్రాఫిక్‌ గందరగోళం

– రోడ్డు ఉందా? పార్కింగ్‌ స్థలమా? కాజులూరు, ఏప్రిల్ 8 పెన్ పవర్: మండల పరిధిలోని గొల్లపాలెం–ద్రాక్షారామం ప్రధాన రహదారి ప్రస్తుతం ట్రాఫిక్‌ నరకంగా మారింది. ఒకప్పుడు విశాలంగా మూడు భారీ వాహనాలు సులభంగా వెళ్లగలిగిన ఈ రోడ్డు, ఇప్పుడు అక్రమ పార్కింగ్‌లు, ఆక్రమణలతో ఇరుక్కుపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా వ్యాపార దుకాణాలు విస్తరించడంతో పాటు వాహనదారులు ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే వాహనాలు నిలిపివేయడం ట్రాఫిక్‌ సమస్యను మరింత తీవ్రమైంది. ముఖ్యంగా కాజులూరు, ఆర్యవటం, గొల్లపాలెం మార్కెట్ సెంటర్, మణిపలావ్ సెంటర్...