గ్రామసభలో వినతుల పరిష్కారానికి చర్యలు: ప్రత్యేక అధికారి డి.గిరిబాబు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 16:గ్రామసభలో వచ్చిన వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జీకే వీధి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి దాసరి గిరిబాబు తెలిపారు.గురువారం జీకే వీధిలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన మాట్లాడుతూ—గిరిజనులు గ్రామసభపై విశ్వాసంతో తమ సమస్యలు, వినతులను సమర్పించారని అన్నారు. వాటిపై ప్రత్యేక తీర్మానాలు చేసి పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సభలో సభ్యులు గతంలో పంచాయతీ చేసిన తీర్మానాలను సమీక్షించాలని, పంచాయతీ నిధులు సక్రమంగా వినియోగించాయో లేదో పరిశీలించాలని ప్రత్యేక అధికారిని కోరారు. అలాగే వివిధ...