గ్రామస్థాయిలో టీడీపీ బలోపేతమే లక్ష్యం: జీకే వీధి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి
గూడెంకొత్తవీధి/చింతపల్లి,పెన్ పవర్, ఏప్రిల్ 26:గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామాల పర్యటన చేపడుతున్నట్లు ఆ పార్టీ జీకేవీధి మండల ప్రధాన కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి నాగమణి తెలిపారు. చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఆదివారం ఆమె పర్యటించి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అర్హులకు చేరుతున్నాయని చెప్పారు. పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలు సంతృప్తిగా...