ఘనంగా ఈస్టర్ వేడుకలు…
పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 5 మండల కేంద్రంలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తెలుగు బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవులు యేసు క్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకుంటూ ఈస్టర్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రార్థనా మందిరానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చ్ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక గీతాలతో మార్మోగిపోయింది.యేసు లేచెను ఆదివరమున జయ జయ యేసు జయ యేసు అంటూ విశ్వాసులు ఉత్సాహంగా ఈస్టర్ ప్రత్యేక కీర్తనలు ఆలపించి వీధులలో కొవ్వొత్తులతోర్యాలీ...