ఘనంగా టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణస్వీకారం

కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 5: కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో ఆదివారం టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం గొల్లపాలెం సొసైటీ అధ్యక్షులు అంగర కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గొల్లపాలెం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నక్క శ్రీను, ఉపాధ్యక్షుడిగా వనమాడి శ్రీను ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు చుండ్రు వీరాజు చౌదరి, కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు) హాజరయ్యారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు సలాది సాయిబాబు, వనం వీరబ్రహ్మం, అంగర...