ఘనంగా వీరేపల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.
ఉలవపాడు, పెన్ పవర్, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామ పంచాయితీ నందు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరేపల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ ఎంపీడీఓ సీ.హెచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తొలుత గ్రామ సచివాలయం నందు పంచాయతీ సెక్రటరీ కె.సుమలత ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సామాజిక సంస్కర్త, మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన...