చింతపల్లి నియోజకవర్గం పునరుద్ధరణ అత్యవసరం: స్థానికులు, నేతల డిమాండ్

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 11:చింతపల్లి నియోజకవర్గం పునరుద్ధరణ అత్యవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్ పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో వంచుల పంచాయతీ ఎల్లవరం కట్టు వీధిలో స్థానిక ప్రజలతో కలిసి చింతపల్లి నియోజకవర్గం అవసరంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వనపల రాజేష్ మాట్లాడుతూ, పరిపాలనా సౌలభ్యం కోసం చింతపల్లి నియోజకవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో చింతపల్లి నియోజకవర్గం ఉన్నప్పటికీ, పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాన్ని తొలగించి పాడేరు నియోజకవర్గంగా మార్చారని...