చింతపల్లి వీరభద్రరావు మృతి పట్ల మంత్రి సంతాపం

పాడే మోసి కడసారి వీడ్కోలు పలికిన మంత్రి సుభాష్ రామచంద్రపురం, పెన్ పవర్, ఏప్రిల్ 14: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు అకాల మరణం పట్ల రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మరణ వార్త తెలిసిన వెంటనే మంత్రి సుభాష్ స్వగ్రామమైన హసనాబాద్‌కు చేరుకుని వీరభద్రరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు. ఈ కష్టకాలంలో...