చింతూరులో ఇంధనంపై స్పష్టత కొరత లేదని ఐటిడిఏ హామీ

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 27: చింతూరు డివిజన్‌లో ఇంధన (ఫ్యూయల్) సరఫరాపై ఎటువంటి కొరత లేదని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొక్వాల్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అపోహలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఇంధన లభ్యతను పర్యవేక్షించేందుకు రంపచోడవరం జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, ఎక్కడైనా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే స్పందించి పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంధనానికి సంబంధించిన...