చింతూరులో ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 68 దరఖాస్తులు స్వీకరణ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 29: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రాజెక్టు అధికారి శుభం నోఖ్వాల్, ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 68 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు ఆన్లైన్ ద్వారా పంపించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సిందిగా ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల సమస్యలను సమగ్రంగా తెలుసుకుని తక్షణ...