చింతూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం

చింతూరు, పన్ పవర్, ఏప్రిల్ 22: పోలవరం జిల్లాలోని చింతూరులో ఐటిడిఏ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమం బుధవారం నిర్వహించబడనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చింతూరు డివిజన్ పరిధిలోని ప్రజలు తమ ఫిర్యాదులు, సమస్యలు, వినతిపత్రాలను నేరుగా అధికారులకు సమర్పించవచ్చు. సంబంధిత శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరై, వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ...