చిన్నారుల మెదడు అభివృద్ధికి తొలి మూడు సంవత్సరాలే కీలకం

  గంగవరం మండలంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: చిన్నారుల జీవితంలో తొలి మూడు సంవత్సరాలు మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమని, ఈ దశలో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం ద్వారా వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి వి. సుచరిత ఆదిలక్ష్మి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని చిన్నగార్లపాడు, పెదగార్లపాడు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఆమె సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జననం నుంచి రెండు సంవత్సరాల...