చిన్న కండ్లేరు చెరువుకు మొండిచేయి..!
మర్మత్తుల మాటే మరిచిపోయిన కూటమి ప్రభుత్వం పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 8 పుల్లల చెరువు మండల రైతుల గుండెల్లో నిండిన ఆవేదన ఇప్పుడు ఆగ్రహంగా మారుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవనాడిగా నిలిచిన చిన్న కండ్లేరు చెరువు నేడు నిర్లక్ష్యానికి బలైపోయింది. చెరువుల పునరుద్ధరణ పేరుతో కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్టు ప్రకటనలు చేసిన ప్రభుత్వం, చిన్న కండ్లేరు చెరువుకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవటంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. *చెరువు బాగుంటేనే మా బతుకు బాగుంటాయి* రైతుల ఆశలు ఇప్పుడు...